Posts

Showing posts from May, 2018

Mahanati Title Song Lyrical - savitri - By Mee Snehageetham

Image
అభినేత్రి ఓ అభినేత్రి అభినయనేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించీ పులకించినది ఈ జనధాత్రీ నిండుగా ఉందిలే దుర్గ దీవెనం  ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభా గుణం ఆ నట రాజుకు స్త్రీ రూపం కళకే అంకితం నీ కణ కణం వెండితెరకెన్నడో ఉందిలే రుణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకే దోరికిన సౌభాగ్యం మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ కళను వలచావు కళను గెలిచావూ కడలికెదురీది కథగ నిలిచావూ భాష ఏదైనా ఎదిగి ఒదిగావూ చరిత పుటలోన వెలుగు పొదిగావూ పెను శిఖరాగ్రామై గగనాలపై నిలిపావుగా అడుగు నీ ముఖచిత్రమై నలు చెరగులా తల ఎత్తినది మన తెలుగూ..ఊఊ మనసు వైశాల్యం పెంచుకున్నావూ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మనసు వైశాల్యం పెంచుకున్నావూ పరుల కన్నీరు పంచుకున్నావూ అసలు ధనమేదో తెలుసుకున్నావూ తుదకు మిగిలేదీ అందుకున్నావు పరమార్థానికీ అసలర్ధమే నువు నడిచిన ఈ మార్గం కనుకేగా మరి నీదైనదీ నువుగా అడగని వైభోగం మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ మహానటీ Mee Snehageetham ., Madhavi Raju